ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిందితుడి నివాసంలో ఆడుకోవడానికి వెళ్లిన మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నేరం అనంతరం పరారీలో ఉన్న 23 ఏళ్ల నిందితుడు సంతోష్ ఖుంటియాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిన్నారి ఆడుకోవడానికి తన ఇంటికి వచ్చినప్పుడు ఖుంటియా ఇంటి వద్ద ఇతర వ్యక్తులు ఎవరూ లేరన్నారు. మద్యం మత్తులో ఉన్న సంతోష్ ఖుంటియా మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడంతో ఆమెను రక్షించినట్లు భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు.
చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆమె శారీరక స్థితి నిలకడగా ఉంది. కుటుంబీకులు అప్రమత్తమైన తర్వాత, ప్రత్యేక పోలీసు బృందం నేరస్థలానికి చేరుకుంది, సమీపంలోని పిపిలి ప్రాంతంలో నిందితుడిని గుర్తించి, 24 గంటల్లో అతన్ని పట్టుకుంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు బాధితురాలి తల్లిని కూడా బెదిరించినట్లు తేలింది. ఫోరెన్సిక్ బృందాలు కీలకమైన సాక్ష్యాలను పొందాయని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు నొక్కిచెప్పారు.