హైదరాబాద్: ఎల్‌బీనగర్ రోడ్డు వద్ద శనివారం రాత్రి ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయం సమీపంలోని పేవ్‌మెంట్‌పై సుమారు 35 ఏళ్ల మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
హంతకుడు కత్తితో మహిళ గొంతు కోసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు పరిసరాల్లో అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.