హైదరాబాద్: నగరంలోని బహదూర్‌పురాలో బుధవారం పట్టపగలు అఖిల్(26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు.సౌత్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ పి.సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అఖిల్‌ను షకీల్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని పట్టుకున్న తర్వాత హత్యకు గల కారణాలను నిర్ధారిస్తాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హత్య అనంతరం ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది.
