హైదరాబాద్: నగరానికి చెందిన ఓ రియల్టర్ బీదర్‌లో శనివారం హత్యకు గురయ్యాడు. జాతీయ రహదారిపై మూసి ఉన్న దాబా పక్కన నిర్మానుష్య ప్రదేశంలో మధు మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో నలుగురు వ్యక్తులు మృతదేహాన్ని వదిలివెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. మధుపై బీరు సీసాలు, బండరాయితో దాడి చేసినట్లు తెలుస్తోందని కర్ణాటక పోలీసులు తెలిపారు. జీడిమెట్ల పోలీసులకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని అధికారులు తెలిపారు.