హైదరాబాద్: బహదూర్‌పురాలో బుధవారం ఉదయం 30 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇంకా గుర్తించలేని బాధితుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బహదూర్‌పురా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓజీహెచ్‌కు తరలించారు.
మరిన్ని వివరాలు తెలియాల్సివుంది
