ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజగా నారాయణ మెడికల్ కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ప్రదీప్ అనే విద్యార్ధి నెల్లూరులోని నారాయణ మెడికల్ కాళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో రాహుల్ అనే ఎంబీబీఎస్ స్టూడెంట్ తనని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దింతో మనస్తాపానికి గురైన ప్రదీప్, తన ఆత్మహత్యకు రాహుల్ కారణమని సోదరుడికి మెసేజ్ పెట్టి బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రదీప్ అక్కడికక్కడే చనిపోయాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రదీప్ మరణంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తమ బిడ్డ మరణానికి ర్యాగింగే కారణమని తల్లిదండ్రులు అంటున్నారు. తమ కొడుకు మరణానికి కారణమైన రాహుల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.