Boy Attacked By Wifes Family

Boy Attacked By Wifes Family: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. హైదరాబాద్ నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్, భువనగిరి జిల్లా రామలింగంపల్లికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, అజయ్ కుటుంబ సమక్షంలో వివాహం చేసుకున్నారు. కానీ యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించలేదు. పెళ్లి జరిగిన రెండు రోజులకే వారు అజయ్ ఇంటికి వచ్చి, మాయమాటలతో యువతిని తీసుకెళ్లారు. తరువాత ఆమె ఫోన్ తీసుకుని, అజయ్‌తో చాటింగ్ చేసి గ్రామానికి రావాలని పిలిచారు. భార్యే పిలుస్తుందని నమ్మిన అజయ్ రామలింగంపల్లికి వెళ్లాడు.

గ్రామ శివారులో ముందే ప్లాన్ వేసుకుని ఉన్న యువతి కుటుంబ సభ్యులు అజయ్‌పై దాడి చేశారు. అతని కళ్లలో కారం పొడి వేసి, కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. అతనికి దాదాపు 14 కత్తిపోట్లు పడ్డాయి. చనిపోయాడని భావించి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు అజయ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.. కానీ కుటుంబ సభ్యులు మాత్రం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *