News5am, Breaking News Telugu (05-06-2025): వరంగల్‌లో ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో భారీ మోసం బయటపడింది. మోసం చేసింది బయట వ్యక్తులని అనుకుంటే పొరపాటు. నిజానికి బ్యాంక్ మేనేజర్ సహా అక్కడి సిబ్బంది కలసి ఈ మోసానికి పాల్పడ్డారు. మొత్తం రూ. 43 లక్షల వరకు లూటీ చేశారు. బ్యాంక్ మేనేజర్ కొప్పుల శివకృష్ణ, జాయింట్ కస్టోడియన్లు రాము శర్మ, జీవిత కుమార్, గోల్డ్ అప్రైజర్లు బ్రహ్మచారి, రాజమౌళి, కరుణాకర్ తదితరులు కస్టమర్ల పేర్లను ఉపయోగించి అక్రమ ఖాతాలను తెరిచినట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన బ్యాంకు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించగా, తప్పుడు ఖాతాల ఆధారంగా నకిలీ బంగారు ఆభరణాలను జమ చేసినట్లు గుర్తించారు. అందువల్ల రూ. 43 లక్షల రుణం తీసుకున్నట్లు స్పష్టమైంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్ర ప్రకాష్ ఫిర్యాదు చేయడంతో, వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసులు మేనేజర్ శివకృష్ణతో పాటు కస్టోడియన్లు, అప్రైజర్లపై IPC సెక్షన్ 221 కింద కేసు నమోదు చేశారు.
More News:
Telugu News Breaking
తల్లి బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు వెళ్తే.. దారుణ హత్యకు గురైన కొడుకు..
More News Telugu: External Sources
ఎంతకు తెగించార్రా.. ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఘరానా మోసం..