Calcutta Student Rape Case: పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకో ఘటన వెలుగులోకి వస్తుండగా, తాజాగా కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చదువుతున్న విద్యార్థిని పై అదే కాలేజీలోని మరో విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. మానసికంగా కృంగిపోయిన విద్యార్థిని స్నేహితుడు “కౌన్సిలింగ్ ఇస్తానంటూ” బాయ్స్ హాస్టల్‌కు రమ్మని పిలిచాడు. అక్కడ ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి స్పృహ కోల్పోయిన తరువాత అత్యాచారం చేశాడు. స్పృహ వచ్చిన తరువాత జరిగినదాన్ని గ్రహించిన ఆమె అతడిని ప్రశ్నించగా, విషయం బయటకు చెప్పితే చంపేస్తానని బెదిరించాడు.
దాంతో బాధితురాలు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే సమయంలో, కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉద్రేకం రేపుతూనే ఉంది. అంతేకాక, నెలరోజుల క్రితం న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కూడా గుర్తు చేయదగినది. ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతపై తీవ్ర ప్రశ్నలు పెడుతున్నాయి.
Internal Links:
హర్యానాలో అదృశ్యమైన మోడల్ హత్య..
గంజాయి రవాణా చేస్తున్న భార్యాభర్తలు..
External Links:
కోల్‌కతాలో ఐఐఎం విద్యార్థినిపై అత్యాచారం