తాగుబోతు తండ్రి కూతురిని అమ్మేసిన ఘటన ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి తన బిడ్డను అమ్మేసిన ఘటన హృదయ విదారకంగా ఉంది. నూగూరు వెంకటాపురం గ్రామంలో నివసించే జంపయ్య, లక్ష్మి దంపతులకు ఇటీవల పాప పుట్టింది. కానీ, ఏటూరునాగారం మండలం రామన్నగూడెంకు చెందిన సుధాకర్ అనే వ్యక్తికి అప్పుడే పుట్టిన శిశువును అమ్మేందుకు కన్న తండ్రి (జంపయ్య) బేరం కుదుర్చుకున్నాడు.
భార్యకు తెలియకుండా పసికందును తీసుకెళ్లి, పాపను, పాత ద్విచక్ర వాహనాన్ని రూ.15 వేలకు విక్రయించాడు. అయితే పాప చనిపోయిందని, తానే పూడ్చిపెట్టానని భార్య, బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. జంపయ్య మనస్తత్వం తెలిసిన కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీశారు. దింతో బిడ్డను అమ్మేశానని చెప్పాడు. వారంతా దిగ్భ్రాంతికి గురై జంపయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు.