కడప జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన సిద్దవటం మండలం లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయితే రాయచోటి ఘాటులో పురుగుల మందు తాగిన గంగయ్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాజుల గంగయ్య లింగంపల్లి పంప్ హౌస్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. ఇంతలో భార్య సంధ్య తన ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండగా, గంగయ్య అది చూసి మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సంధ్య భర్తను హత్య చేయాలని భావించింది.
ఆ తర్వాత భార్య సంధ్య తన ప్రియుడు బాల్‌రాజ్ సాయంతో భర్త గంగయ్యను హత్య చేసి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆగస్టు 22 నుంచి గాజుల గంగయ్య అదృశ్యమైనట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ప్రియుడు, ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను విచారించగా, విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.