రాష్టంలో ఎక్కడ చూసిన యువత రాత్రనక పగలనక గంజాయి సేవించి వివిధ రకాల అఘాయిత్యాలకు పాల్పడుతూ రోడ్ల మీద వీరంగం సృష్టిస్తున్నారు. మత్తులో సోయి లేకుండా వారు ఏంచేస్తున్నారో, అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరుల ప్రాణాలను తీసేందుకు సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే మంగళవారం మేడ్చల్ జిల్లాలోని గాగిల్లాపూర్‌లో కొంతమంది యువకులు గంజాయి సేవించి హల్‌చల్ చేస్తూ వీరంగం సృష్టించారు. ఏకంగా తోటి స్నేహితుడుపై బీరు బాటిల్‌తో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు గమనించి వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులు మదన్ కుమార్, సాయిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.