రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతిబెన్‌కు 25 ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. భర్తతో విభేదాల కారణంగా 20 ఏళ్లుగా పెద్ద కుమారుడు నీలేష్‌తో కలిసి స్థానికంగా ఉంటోంది. నిన్న(శుక్రవారం) రాత్రి తల్లీకొడుకుల మధ్య జరిగిన గొడవ ఆమె ప్రాణాలను బలిగొంది. జ్యోతిబెన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటుంది. కొడుకు నీలేష్ జ్యోతిబెన్ తో తరచూ గొడవ పడుతుండేవాడు. వీరి మధ్య తరచూ భౌతిక దాడులు జరిగేవి. గత నెల రోజులుగా ఆమె మందులు తీసుకోవడం మానేసింది. దీంతో ఆమె పరిస్థితి మరింత దిగజారింది.
ఈ నేపథ్యంలో రాజ్‌కోట్‌లోని యూనివర్సిటీ రోడ్డులోని భగత్‌సిన్హ్‌జీ గార్డెన్‌లో తల్లీకుమారుడు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కత్తితో తల్లిపై యువకుడు తీవ్రంగా దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించి అతని వద్ద నుంచి కత్తిని లాక్కుంది. దీంతో కోపోద్రిక్తుడైన నీలేష్ ఆమె గొంతుకు దుప్పటి వేసి హత్య చేశాడు. అనంతరం తల్లి మృతదేహంతో ఫొటోలు దిగాడు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఒక పోస్ట్‌లో “సారీ అమ్మా, నేను నిన్ను చంపాను. ఓం శాంతి, నిన్ను మిస్సయ్యాను” అని రాసి ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వారు వచ్చి నీలేష్ తల్లి మృతదేహాన్ని చూశారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.