సంగారెడ్డిలోని నారాయణఖేడ్ పట్టణంలో 60 ఏళ్ల మానసిక వృద్ధురాలిపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఓ దుకాణం ముందు అర్థరాత్రి నిద్రిస్తున్న మహిళ వద్దకు వెళ్లిన ఆ దుండగుడు మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆ మహిళా ఎంత వారించినా వినకుండా, తన పై అత్యాచారానికి పాల్పడిన సంఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యింది.
సాయం కోసం మహిళ కేకలు వేయడంతో ప్రజలు నిద్రిస్తున్న ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. నారాయణఖేడ్ పట్టాణ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు మహిళను ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతడిని తన పట్టణంలోని కూరగాయల వ్యాపారి ఎండి మోయిన్‌గా గుర్తించి అరెస్టు చేశారు.