Radhika Yadav Murder: హరియాణాకు చెందిన 25 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గురువారం (జులై 10) వంటచేస్తుండగా ఆమె తండ్రి దీపక్ యాదవ్ (49) గన్‌తో ఆమెపై వెనక నుంచి కాల్పులు జరిపాడు. దీంతో రాధిక అక్కడికక్కడే మరణించింది. నేరాన్ని అంగీకరించిన దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో దీపక్ కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించాడని, తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడని తెలిసింది. గత 15 రోజులుగా నిద్ర లేకుండా తిరుగుతూ, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేవాడని పోలీసులు తెలిపారు. రాధిక తన తండ్రికి కౌన్సెలింగ్ కూడా ఇస్తుండేదని, ఇటీవల వజీరాబాద్ గ్రామంలో కొంతమంది దీపక్‌ను కుమార్తె ఆదాయంపై జీవిస్తాడని ఎగతాళి చేశారని తెలుస్తోంది.
గ్రామం నుంచి వచ్చిన తర్వాత దీపక్, రాధికతో టెన్నిస్ అకాడమీ మూసేయమని వాదించసాగాడు. అయితే రాధిక రూ.2 కోట్లు ఖర్చు పెట్టి సాధించిన కెరీర్‌ను వదులుకోనని, తన శిక్షణతో పిల్లలకు టెన్నిస్ నేర్పుతానని చెప్పింది. దీని వల్ల మరింత నెగెటివ్‌గా మారిన దీపక్, ఒక దశలో తన ప్రాణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నించాడు. చివరకు కూతురినే హత్య చేశాడు. ఘటన జరిగిన రోజు కూడా వారి మధ్య గొడవ జరిగింది. శుక్రవారం రాధిక అంత్యక్రియలు నిర్వహించగా, ఆమె సోదరుడు ధీరజ్ చితికి నిప్పంటించాడు. సుమారు 150 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, రాధికకు నాలుగు బుల్లెట్లు తగిలినట్లు తెలిపారు. మూడు వెనుకభాగంలో, ఒకటి భుజంలో.
Internal Links:
హర్యానాలో అదృశ్యమైన మోడల్ హత్య..
గంజాయి రవాణా చేస్తున్న భార్యాభర్తలు..
External Links:
టెన్నిస్ ప్లేయర్ హత్య కేసు.. వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు!