అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తపేటలోని తొగట వీధిలో రమాదేవి తన ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నారు. ఆమె భర్త కువైట్ కు మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం వెళ్లారు. శనివారం ఉదయం సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలి పోయింది. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతో రమాదేవి, ఇద్దరు పిల్లలు మనోహర్, మన్విత మృతి చెందారు.
అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ఇది ఆత్మహత్యా? లేక కాకతాళీయంగా జరిగిన ఘటనా? అన్న దానిపై పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.