తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. వివరాల్లోకి వెళ్తే, రాజానగరం దివాన్ చేరువు జాతీయ రహదారి పై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గైట్ కళాశాలలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు దుర్మారణం చెందారు. మృతులు శ్రీకాకుళం చెందిన రోనంకి ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లాకు చెందిన చింతా కార్తీక్ (19) గా పోలీసులు పరిగణించారు. అయితే ఇద్దరు విద్యార్థులై బైక్ పై దివాన్ చెరువు వెళుతుండగా వెనుకనుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది.
దాంతో ఆ జాతీయ రహదారి పై విద్యార్థుల శరీర భాగాలు చల్లచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటన అనంతరం లారీ డ్రైవర్ బైకును ఢీకొన్న వెంటనే వాహనంతో సహా పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.