జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఎన్వీ దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్రాంత ఉపాధ్యాయుడు శంతన్, స్కూల్ అసిస్టెంట్లు బాలయ్య, ఓమాజీలు తనని మాటలతోటి బాధపెడుతున్నారని డీఈవో చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కూడా తన మీద విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి విమర్శల వల్ల తన కుటుంబ సభ్యులు ఒత్తిడికి లోనౌతున్నారు అని ఆయన వెల్లడించారు.