News5am, Telugu Latest(20-05-2025): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో జరిగిన చోరీ కలకలం రేపింది. మే 14న ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న సుధర్మ భవన్‌లో హార్డ్ డిస్క్‌లు చోరీకి గురయ్యాయి. ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి కంప్యూటర్ నుంచి హార్డ్ డిస్క్‌లు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇందులో రాజ్ భవన్‌కు సంబంధించిన వ్యవహారాలు, ముఖ్యమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ ఘటనను రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని గుర్తించారు. చోరీకి గురైన హార్డ్ డిస్క్‌లు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్‌లు ఎందుకు చోరీ చేశాడన్న దానిపై, ఎవరైనా ఇతనికి సహాయపడ్డారా, లేదా డేటాను దుర్వినియోగం చేశాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
More Buzz:
Telugu Crime Buzz:
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర..
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ..
More Crime Buzz News: External Sources
https://www.v6velugu.com/theft-at-telangana-raj-bhavan