తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న గజదొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ సమీపంలోని దుర్షెడ్ గ్రామానికి చెందిన యుగేందర్ కూలీ పని మరియు వ్యాన్ క్లీనర్ గా పనిచేస్తున్నాడు.
మద్యం, జల్సాలకు అలవాటు పడిన యుగేందర్‌కు డబ్బులు దోచుకోవడం అలవాటు. ఈ నెల 26న ఎల్లారెడ్డిపేట మండలం గోరంటాల గ్రామ శివారులోని సాయిబాబా ఆలయంలో, అదే రోజు రాత్రి బొప్పాపూర్ శివారులోని ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఆలయాల్లో చోరీలపై నిఘా ఉంచేందుకు ఎల్లారెడ్డిపేట సీఐ, ఎస్‌ఐ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా యుగేందర్ పట్టుబడ్డాడని డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.