కర్నూలు: ఆస్తి తగాదాల విషయమై సోదరుడితో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కోడుమూరు మండలం అనుగొండ గ్రామంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. మృతుడు అనుగొండ గ్రామానికి చెందిన బోయ వెంకట్రాముడు (36) వ్యవసాయ కూలీ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు అన్నదమ్ములు బోయ భాస్కర్, అతని తమ్ముడు బోయ వెంకట్రాముడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తమ్ముడి మృతికి దారి తీసింది. కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేశారు.