కర్నూలు: మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురికి ఒక్కొక్కరికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆర్.రామభూపాల్ రెడ్డి తీర్పు చెప్పారు. నంద్యాలలోని జగన్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి వద్ద తనిఖీల్లో మద్యం మత్తులో నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, సిబ్బంది పట్టుబడిన వారిలో నంద్యాల మండలానికి చెందిన మంజుల ఆంజనేయులు, నంద్యాల పట్టణానికి చెందిన నాగలాపురపు శామ్యూల్, వెలుగోడుకు చెందిన మేడం రామకృష్ణ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.