ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదంలో డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు మిల్క్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5 గంటలకు బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోజికోట్ గ్రామ సమీపంలో జరిగింది.
పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. బస్సు ఢీకొనడంతో పాల ట్యాంకర్ బోల్తా పడ్డట్లు బంగార్మావు సర్కిల్ ఆఫీసర్ (సిఓ) అరవింద్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. బాధితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.