68 Migrants Dead

68 Migrants Dead: యెమెన్ తీరంలో ఆదివారం జరిగిన విషాదకర ఘటనలో 154 మంది వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మృతి చెందగా, 74 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు కేవలం 10 మందినే రక్షించామని యెమెన్ ఆరోగ్య అధికారి తెలిపారు. రక్షించబడినవారిలో తొమ్మిది మంది ఇథియోపియన్ జాతీయులు కాగా, ఒకరు యెమెన్‌కు చెందినవారు. ఈ పడవ ఆదివారం తెల్లవారుజామున దక్షిణ యెమెన్‌లోని అబ్యాన్ ప్రావిన్స్‌లో అడెన్ గల్ఫ్ ప్రాంతంలో మునిగిపోయిందని ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ (IOM) తెలిపింది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి గల్ఫ్ దేశాలకెళ్లే వలసదారులు తరచూ ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారని వెల్లడించింది.

ఇథియోపియా, సోమాలియా వంటి దేశాల వలసదారులు మెరుగైన జీవితం కోసం సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలకు వెళ్లాలని భావించి, ప్రమాదకర సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం అత్యంత రద్దీగా ఉండే ప్రమాదకర వలస మార్గాల్లో ఒకటిగా గుర్తించబడింది. 2024లో ఇప్పటివరకు 60,000 మందికి పైగా వలసదారులు యెమెన్‌లోకి ప్రవేశించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని IOM తెలిపింది. గత ఏడాది ఈ మార్గంలో 558 మంది మృతి చెందగా, గత పదేళ్లలో మొత్తం 2,082 మంది గల్లంతయ్యారు. వీరిలో 693 మంది మునిగిపోయినవారిగా గుర్తించబడ్డారు.

Internal Links:

ట్రంప్‎కు రష్యా ఎంపీ కౌంటర్..

 ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు..

External Links:

యెమెన్ తీరంలో మునిగిన పడవ.. 68 మంది శరణార్థులు మృతి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *