Ali Khamenei: అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 37 ఏళ్లుగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని తొలిసారి విరమించి, ఫిబ్రవరి 8న జరిగే వైమానిక దళ కమాండర్ల సమావేశానికి హాజరుకాలేదు. ఆయన స్థానంలో ఆర్మీ చీఫ్ అబ్దొల్‌రహీం మౌసవి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ గైర్హాజరు వెనుక అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, డ్రోన్లను మోహరించగా, అణు కార్యక్రమం, క్షిపణి వ్యవస్థపై విభేదాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
అమెరికాతో ఉద్రిక్తతలు.. 37 ఏళ్ల సంప్రదాయానికి ఖమేనీ బ్రేక్