News5am, Breaking Telugu Flash News (16-05-2025): చైనాను శుక్రవారం (మే 16) ఉదయం 6:30 గంటల సమయంలో భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూమి కంపించింది. ఇది సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపమని అధికారులు వెల్లడించారు. ప్రకంపనలు వచ్చేసరికి భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక బృందాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో తరచూ భూకంపాలు నమోదవుతుండటం తెలిసిందే. ఇదే సమయంలో, టర్కీలో వచ్చిన భూకంపం తరువాత కొద్ది గంటల్లోనే చైనాలో కూడా భూ ప్రకంపనలు రావడం గమనార్హం.
ఇక గురువారం (మే 15) టర్కీలో మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం టర్కీని తీవ్రంగా వణికించింది. టర్కీలోని కోన్యా ప్రాంతంలో భూమి కంపించిందని సమాచారం. 5.2 తీవ్రత కారణంగా కొన్ని భవనాలు కూలిపోయాయి. ఈ భూకంపం టర్కీ సెంట్రల్ అనటోలియా ప్రాంతంలో ఉన్న కోన్యా ప్రావిన్సులో నమోదైనట్లు తెలుస్తోంది.
More Breaking Telugu Flash News:
Breaking Telugu Latest News:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు..
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు…
More Breaking Latest News: External Sources
https://www.v6velugu.com/earthquake-today-4-5-magnitude-earthquake-hits-china#google_vignette