News5am, Breaking Telugu News (05-06-2025): అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్, విదేశీ విద్యార్థులకు వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే స్టూడెంట్ వీసాలపై కఠిన నిబంధనలు తీసుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలనుకున్న విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని రద్దు చేసింది. జూన్ 4న విడుదల చేసిన ప్రకటనలో, జాతీయ భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థుల సమాచారాన్ని సరిగ్గా ఇవ్వడం లేదని, ముగ్గురు విద్యార్థుల వివరాల్లో లోపాలున్నాయని తెలిపింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హార్వర్డ్ తీరుతో దేశ భద్రతకు ముప్పు ఉందని పేర్కొంది ట్రంప్ సర్కార్.
ఇక మరోవైపు, వారం క్రితం ట్రంప్ ప్రభుత్వం స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలోని అమెరికా ఎంబసీలకు ఈ విషయాన్ని తెలియజేసింది. విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించిన తర్వాతే ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. అమెరికా వ్యతిరేకంగా లేదా హమాస్ అనుకూలంగా పోస్టులు ఉన్నవారిని నిరాకరించనున్నారు. దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారణ వచ్చిన తర్వాతే వీసా ఇవ్వనున్నారు.
More Breaking Telugu News Today:
Telugu News:
స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు పెంపు..
డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు..
More Breaking News Updated: External Sources
స్టూడెంట్స్ కు మరో షాక్ ఇచ్చిన ట్రంప్.. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు నో ఎంట్రీ..