News5am, Breaking Telugu News (11-06-2025): రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శాంతి చర్చలు మొదలయ్యాయి కానీ ఎటువంటి ఫలితం రాలేదు. తాజాగా ఇస్తాంబుల్‌లో మరోసారి చర్చలు ప్రారంభం కానుండగా ఉక్రెయిన్ ఆకస్మికంగా రష్యా మీద డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో రష్యా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే చర్చల తరువాత శాంతికి ఓ మంచి మార్గం ఏర్పడింది. ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో కీలక పురోగతి సాధించడంతో, 25 ఏళ్లలోపు ఉన్న యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకున్నారు. వీరు యుద్ధం మొదలైనప్పటి నుండి ఖైదీలుగా ఉన్నవారు. ఖైదీల మార్పిడి ఒక గోప్యమైన ప్రదేశంలో జరిగింది.
రష్యా రక్షణ శాఖ ఖైదీల విడుదల వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం వారిని బెలారస్‌లో చికిత్స అందిస్తోందని, తర్వాత మాస్కో ఆసుపత్రులకు తరలిస్తామని తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఖైదీల మార్పిడి జరగిందని ధృవీకరించారు. ఇస్తాంబుల్‌లో జరిగిన రెండో దశ చర్చల్లో ఈ మార్పిడికి ఇరు దేశాలు ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే మరోవైపు రష్యా ఇప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులు చేస్తూనే ఉంది. మంగళవారం కీవ్‌పై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు మృతిచెందగా, 13 మంది గాయపడ్డారు. గత మూడు సంవత్సరాల యుద్ధంలో ఇది రష్యా చేసిన అతిపెద్ద దాడుల్లో ఒకటి అని జెలెన్‌స్కీ తెలిపారు. అలాగే ఉక్రెయిన్ కూడా “స్పైడర్ వెబ్” పేరుతో రష్యాపై తీవ్రమైన దాడులు చేసింది.
More Breaking News:
Telugu News:
ఆస్ట్రియా స్కూల్‌లో కాల్పులు..
స్టార్‌లింక్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్..
More Breaking Telugu News: External Sources
రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం.. ఇరు పక్షాల యుద్ధ ఖైదీల విడుదల