China And Taiwan: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు తగ్గుముఖం పడుతున్నాయనే సమయంలో మరో కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా చైనా–తైవాన్ మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే థాయ్‌లాండ్–కంబోడియా కాల్పుల విరమణ ప్రకటించగా, రష్యా–ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి చర్చలు ముందుకు సాగుతున్నాయి. ట్రంప్–జెలెన్‌స్కీ భేటీ తర్వాత శాంతి దిశగా సానుకూల సంకేతాలు రావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో, చైనా చర్యలు కొత్త ఆందోళనలకు కారణమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని తైవాన్ విషయంలో చైనా జోక్యం చేస్తే తాము స్పందించాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు చైనాను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. దాంతో చైనా సైన్యం తైవాన్ చుట్టూ భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. వాయుసేన, నేవీ, రాకెట్ ఫోర్స్ దళాలను మోహరించి లైవ్-ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిని తైవాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ, ఇవి సైనిక బెదిరింపులేనని పేర్కొంది. ఈ చర్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాలు భారీ విన్యాసాలు