Donald Trump: భారత్‌పై, భారతీయులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియాను చిరకాల మిత్రుడిగా పేర్కొంటూనే, అవకాశాలొచ్చినప్పుడల్లా తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా జులై 23 బుధవారం జరిగిన వాషింగ్టన్ ఏఐ సమ్మిట్‌లో ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలకు భారత్‌లో ఉద్యోగ నియామకాలు నిలిపేయాలని ఆదేశించారు. విదేశాల్లో కాకుండా అమెరికాలో ఉద్యోగాలు కల్పించాలని, అమెరికన్ కంపెనీలు తమ దృష్టిని అమెరికాపై కేంద్రీకరించాలన్నారు. ఈ సందర్భంగా భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
అమెరికన్ కంపెనీలు గ్లోబల్ మైండ్‌సెట్‌ను వదిలిపెట్టి అమెరికా ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని ట్రంప్ సూచించారు. అమెరికాలోని స్వేచ్ఛను వినియోగించుకుని ఎదిగిన ఈ కంపెనీలు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని విమర్శించారు. చైనాలో సంస్థలు, ఇండియాలో ఉద్యోగాలు, ఐర్లాండ్‌లో లాభాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కంపెనీలు దేశభక్తిని చాటుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు పని చేయాలని పిలుపునిచ్చారు. టెక్ కంపెనీలు అమెరికాను అన్ని రంగాల్లో ముందుండేలా చేస్తూ, ప్రత్యేకంగా ఏఐ రంగంలో ప్రపంచానికి మార్గదర్శకంగా మారాలని కోరారు. ఇదే సందర్భంలో ట్రంప్ మూడు ఎక్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
Internal Links:
రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్..
External Links:
ఐటీ ఉద్యోగాలు భారతీయులకు ఇవ్వొద్దు : గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ట్రంప్ ఆర్డర్స్