Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలను ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తానే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ఒప్పించానని పేర్కొన్నారు. ఇదివరకు కూడా ఆయన ఇదే విషయాన్ని 20 సార్లకుపైగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారతదేశ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన మంత్రి మోడీ ట్రంప్‌కు లొంగిపోయాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే, ట్రంప్ మాటల్లో నిజం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ వల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని తెలిపింది.
ఇదిలా ఉండగా, ట్రంప్ మరో ఉదాహరణగా థాయిలాండ్-కంబోడియా మధ్య యుద్ధాన్ని కూడా తానే ఆపినట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని నిలిపేయాలని, లేదంటే వాణిజ్య ఒప్పందాలు నిలిపేస్తానని హెచ్చరించినట్టు వివరించారు. అమెరికా ఈ రెండు దేశాలతో విస్తృతంగా వాణిజ్యం చేస్తున్న నేపథ్యంలో, తాను వారి ప్రధాన మంత్రులకు ఫోన్ చేసి హెచ్చరించానని తెలిపారు. ట్రంప్ ప్రకటనల మధ్య, థాయిలాండ్ తమపై దాడులు చేస్తోందని కంబోడియా ఆరోపించడం గమనార్హం.
Internal Links:
ఐటీ ఉద్యోగాలు భారతీయులకు ఇవ్వొద్దు..
External Links:
అప్పుడు భారత్-పాకిస్తాన్, ఇప్పుడు థాయిలాండ్-కంబోడియా..