Donald Trump Hikes Tariffs On 70 Countries

Donald Trump Hikes Tariffs On 70 Countries: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చుతూ, దాదాపు 70కి పైగా దేశాలపై సుంకాలు విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులకు సంతకం చేశారు. ఇవి నేటి నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్‌లలో సిరియాపై 41 శాతం, కెనడాపై 35 శాతం, భారత్‌పై 25 శాతం సుంకాలు విధించారు. ముఖ్యంగా బ్రిక్స్‌ దేశాలపై సుంకాల మోత మోగిస్తానన్న మాటను ట్రంప్ నిలబెట్టుకున్నారు. భారత్‌పై 25 శాతం సుంకాలు విధించడమే కాకుండా, బ్రెజిల్‌పై టారీఫ్‌లను ఏకంగా 50 శాతానికి పెంచారు. అయితే, పొరుగుదేశమైన మెక్సికోకు మాత్రం కొంత ఉపశమనం ఇచ్చారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు 90 రోజుల గడువు ఇస్తున్నట్టు, ఆ సమయంలో 25 శాతం సుంకాలు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఇక భారత్‌పై 25 శాతం సుంకాలు పెనాల్టీతో కలిపి ఈరోజు (ఆగస్టు 1) నుంచి అమలులోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్‌ మిత్రదేశమే అయినా, టారీఫ్స్ ఎక్కువగా ఉండటంతో పాటు రష్యా నుంచి సైనిక సామాగ్రి, చమురు వాణిజ్యం జరుపుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత్‌ ప్రభుత్వం స్పందించింది. ట్రంప్ ప్రకటనను గమనించామని, దాని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్యం, రైతులు, వ్యాపారవేత్తలు, ఎంఎస్‌ఎంఈల సంక్షేమం తమకు ప్రధానలక్ష్యమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

Internal Links:

రష్యా-భారత్ స్నేహంపై విషం కక్కిన ట్రంప్..

రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం..

External Links:

ట్రంప్‌ సుంకాల లిస్ట్.. 70 దేశాలపై టారిఫ్‌ల పూర్తి జాబితా ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *