Earthquake Strikes Alaska: అలాస్కాలో 6.2 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించగా, తజాకిస్తాన్‌లో కూడా వరుసగా భూప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, అలాస్కాలో సంభవించిన భూకంపం భూమికి 48 కిలోమీటర్ల లోతులో ఉండగా, ఇది రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. ఈ ప్రాంతంలో జూలై 17న కూడా 7.3 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తరువాత అలాస్కా తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని, తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని అమెరికా వాతావరణ శాఖ సూచించింది. ఇదిలా ఉండగా, తజాకిస్తాన్‌లోనూ 4.6 తీవ్రతతో భూప్రకంపనలతో పాటు, జూలై 12, 18 తేదీల్లో 3.8, 4.8 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి.
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, దీని కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో 3.4 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. ఇది 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ వరుస భూప్రకంపనలు వాతావరణ శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తున్నాయి.
Internal Links:
టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా గుర్తించిన అమెరికా..
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
External Links:
6.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక..!