ఈశాన్య తైవాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైంది. తైవాన్ రాజధాని తైపీలో పలు భవనాలు ప్రకంపనలకు గురయ్యాయి. కొన్ని సెకన్ల పాటు కంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
తైపీకి తూర్పున ఉన్న యిలాన్ కౌంటీలో దాదాపు 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంపం సంభవించినప్పుడు భవనాలు కొద్దిసేపు కంపించినట్లు యిలాన్ ఫైర్ బ్యూరో అధికారి తెలిపారు. తైపీ మెట్రో వ్యవస్థ ముందు జాగ్రత్తగా రైలు వేగాన్ని తాత్కాలికంగా తగ్గించింది. ఇక హై-స్పీడ్ రైళ్లతో సహా అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా కొనసాగాయి. ఇటీవల, థాయిలాండ్ మరియు మయన్మార్‌లలో ఒక శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ విపత్తు ఆస్తి మరియు ప్రాణాలకు అపారమైన నష్టాన్ని కలిగించింది. 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.