Enough nuclear submarines: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించి రష్యన్ పార్లమెంట్ సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ ఘాటుగా స్పందించారు. ట్రంప్ రష్యా సమీప జలాల్లో రెండు న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ మోహరించామని ప్రకటించడంతో, వాటిని ఎదుర్కొనటానికి రష్యాకు తగినన్ని అణు జలాంతర్గాములు సిద్ధంగా ఉన్నాయని విక్టర్ స్పష్టం చేశారు. ట్రంప్ బెదిరింపులను తేలికగా తీసుకుంటున్నామని, రష్యా ఇప్పటికే ప్రపంచ మహాసముద్రాల్లో అమెరికా కంటే అధిక సంఖ్యలో అణు జలాంతర్గాములను నియంత్రిస్తోందని తెలిపారు. ట్రంప్ పంపిన రెండు జలాంతర్గాములు చాలా కాలంగా రష్యా నిఘాలోనే ఉన్నాయని పేర్కొంటూ, అలాంటి వ్యాఖ్యలకు రష్యా ప్రతిస్పందించాల్సిన అవసరమే లేదన్నారు.
అంతేకాక, ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో రష్యా-ఇండియా సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే పతనమైన ఆర్థిక వ్యవస్థలైన రష్యా, భారత్ కలిసి మరింత దిగజారతాయని అన్నారు. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదెవ్ ఘాటుగా స్పందిస్తూ, ట్రంప్ చెప్పిన “డెడ్ ఎకానమీ” వ్యాఖ్యలపై “ది వాకింగ్ డెడ్” సినిమాలను గుర్తుంచుకోవాలని సూచించారు. రష్యా ఇజ్రాయెల్, ఇరాన్‌లా కాదని, ప్రతి హెచ్చరికను ముప్పుగా తీసుకుంటుందని, యుద్ధం దిశగా అడుగులు వేయడం అనివార్యమవుతుందని పేర్కొన్నారు. మెద్వెదెవ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, వాటికి ప్రతిస్పందనగా రష్యా సమీప జలాల్లోకి అమెరికా న్యూక్లియర్ సబ్‌మెరైన్స్‌ను పంపాలని ఆదేశించానని వెల్లడించారు.
Internal Links:
ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు..
రష్యా-భారత్ స్నేహంపై విషం కక్కిన ట్రంప్..
External Links:
చూసుకుందాం.. మీ కంటే మా దగ్గరే ఎక్కువ న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ ఉన్నయ్: ట్రంప్‌కు రష్యా ఎంపీ కౌంటర్