Hikes Fuel Prices: ఇరాన్‌పై ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరింత సంక్షోభంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు పడిపోయాయి. చమురు ధరలు భారీగా పెరుగుతూ ఉండటంతో థాయ్‌లాండ్ తర్వాత ఇప్పుడు పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయి. పెట్రోల్‌పై రూ.137, డీజిల్‌పై రూ.184, కిరోసిన్‌పై రూ.34.08 పెంచడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా పెంపుతో పెట్రోల్ ధర రూ.458.4, డీజిల్ రూ.520.35, కిరోసిన్ రూ.457.80కు చేరాయి.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం మరింత పెరిగింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత మార్చి 6న మొదటిసారి లీటరుకు రూ.55 పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి ధరలు పెంచింది. కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, తాజా ఇంధన ధరల పెంపుతో మరింత ఆందోళన చెందుతున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు