India To Issue Tourist Visas: భారత ప్రభుత్వం చైనా పౌరులకు శుభవార్తను వెల్లడించింది. 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత నిలిపివేసిన టూరిస్ట్ వీసాలు ఇప్పుడు తిరిగి జారీ చేయనుంది. జూలై 24 నుంచి చైనీయులకు టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా పర్యటన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం ఈ వీసా పునఃప్రారంభాన్ని ధృవీకరించింది. ఇకపై ప్రత్యక్ష విమాన సేవలు, పర్యాటక వీసాలు, భారతీయ యాత్రికుల కైలాష్ మానసరోవర్ యాత్రపై ఇరుదేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి.
ఇటీవల భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి బీజింగ్ పర్యటన చేపట్టి కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2025 వేసవిలో కైలాష్ మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. సరిహద్దు నదులకు సంబంధించిన జలసమాచార మార్పిడి, ఇతర సహకారాలపై చర్చలకు నిపుణుల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు భారత్ పేర్కొంది. జైశంకర్ షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోపాటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ సానుకూలత కనిపించడంతో సంబంధాలు మెరుగవుతున్నట్లు స్పష్టమవుతోంది.
Internal Links:
టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా గుర్తించిన అమెరికా..
External Links:
చైనీయులకు శుభవార్త.. రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్