అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన భార్య ఉష త్వరలో భారతదేశాన్ని పర్యటించనున్నారు. జేడీ వాన్స్ దంపతులు ఈ నెలలో భారతదేశాన్ని సందర్శిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. జేడీ వాన్స్ గత నెలలో ఫ్రాన్స్ మరియు జర్మనీలలో పర్యటించారు. ఆయన రెండవ విదేశీ పర్యటన భారత్ లో ఉండనుంది.
జేడీ వాన్స్ భారతదేశానికి అల్లుడు అనే విషయం తెలిసిందే. అతని భార్య పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో విద్యను అభ్యసించేటప్పుడు జేడీ వాన్స్ ను ప్రేమించారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రధానమంత్రి మోదీ ఇటీవల ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా జేడీ వాన్స్ కుటుంబాన్ని కలిశారు. ఆ సందర్భంగా, మోదీ వాన్స్ పిల్లలకు ప్రత్యేక బహుమతులు కూడా అందజేశారు. వాన్స్ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకలకు కూడా మోదీ హాజరయ్యారు.