Miss Universe: మిస్ యూనివర్స్ 2025 ఫైనల్స్‌లో చిలీ, కొలంబియా, క్యూబా, గ్వాడెలోప్, మెక్సికో, ప్యూర్టోరికో, వెనిజులా, చైనా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మాల్టా, ఐవరీ కోస్ట్ దేశాలు పోటీపడ్డాయి. థాయిలాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్ 1వ రన్నరప్, వెనిజులా ప్రతినిధి స్టెఫానీ అబాసాలి 2వ రన్నరప్‌గా నిలిచారు. ఫిలిప్పీన్స్ అహ్తిసా మనలో 3వ రన్నరప్, ఐవరీ కోస్ట్ ఒలివియా యాకే 4వ రన్నరప్ టైటిళ్లు గెలుచుకున్నారు. అయితే భారత్ తరపున పాల్గొన్న మానిక విశ్వకర్మ టాప్ 12లో స్థానం దక్కించుకోలేక నిరాశ కలిగించింది. శ్రీ గంగానగర్‌కి చెందిన మానిక టాప్ 30 వరకు వచ్చి ఆశలు రేపినా, తదుపరి దశకు చేరుకోలేకపోయింది.
ఫైనల్స్‌లో జరిగిన స్విమ్‌సూట్ రౌండ్‌లో మానిక ప్రదర్శన న్యాయనిర్ణేతలకు ప్రభావితం చేయలేదు. తెల్లటి మోనోకినీలో కనిపించిన ఆమె, ఈ రౌండ్‌లో తగిన స్థాయిలో రాణించకపోవడం వల్ల పోటీ నుంచి తప్పుకుంది. చైనా, కొలంబియా, అమెరికా, మెక్సికోతో పాటు ఇతర దేశాల పోటీదారులతో కలిసి టాప్ 30లో నిలిచినా, తరువాతి దశకు చేరుకోలేకపోయింది. ప్రస్తుతం గ్వాడెలోప్, కొలంబియా, క్యూబా, మెక్సికో, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, చైనా, వెనిజులా ప్రాతినిధులు ఈవినింగ్ గౌన్ రౌండ్‌లో పోటీ కొనసాగిస్తున్నారు. మరోవైపు, 2026లో జరగబోయే 75వ మిస్ యూనివర్స్ పోటీలు ప్యూర్టోరికోలో జరుగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. త్వరలోనే మిస్ యూనివర్స్ 2025 విజేతను ప్రకటించనున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు