Open Letter From Pakistan: భారతదేశానికి బలూచిస్తాన్ నుంచి కీలక మద్దతు లభించింది. ప్రముఖ బలూచ్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాకిస్తాన్–చైనా సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. బలూచిస్తాన్ దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంత్రణలో అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. చైనా బలూచిస్తాన్‌లో తన సైన్యాన్ని మోహరించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు.
ఇక బలూచ్ నాయకులు 2025లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించగా, 2026లో “బలూచిస్తాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్” నిర్వహించనున్నట్లు మీర్ బలూచ్ తెలిపారు. భారతదేశం–బలూచిస్తాన్ మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలను ఆయన గుర్తు చేశారు. చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) వల్ల బలూచిస్తాన్‌కు, భారత్‌కు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, రక్షణ సామర్థ్యాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
పాక్ గడ్డ నుంచి భారత్‌కు తిరుగులేని మద్దతు.. జైశంకర్‌కు బలోచ్ నేత బహిరంగ లేఖ..