PM Modi to Meet China President: భారత్–చైనా సంబంధాల్లో కీలక పరిణామంగా, ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తరువాత ఇది తొలి పర్యటన. చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొనే సందర్భంగా, ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. జపాన్ పర్యటన ముగిసిన వెంటనే మోదీ చైనాకు వెళ్తున్నారు. జిన్‌పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఇటీవల ఎల్ఏసీ వద్ద పెట్రోలింగ్‌పై ఇరు దేశాలు ఒప్పందానికి రావడంతో, ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కూడా ఇరువురు నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల ఢిల్లీలో మోదీని కలుసుకుని, జిన్‌పింగ్ ఆహ్వానం అందించారు. ఆ తరువాత మోదీ, ఇరు దేశాలు పరస్పర గౌరవంతో సంబంధాలు ముందుకు తీసుకెళ్తున్నాయని, టియాంజిన్ సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని స్పందించారు. భారత్‌లోని చైనా రాయబారి జు ఫెయిహాంగ్ కూడా ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాల అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని అన్నారు. పర్యటన విజయవంతం కావడానికి ఇరు దేశాల బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. సరిహద్దుల్లో శాంతి కాపాడటం ముఖ్యమని, న్యాయబద్ధమైన పరిష్కారం కోసం భారత్ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు.
Internal Links:
టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం..
శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్..
External Links:
చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం