కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన పప్పు కాదని, ఉన్నత విద్యావంతుడని వివరించారు. ఈ మేరకు అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ శామ్ పిట్రోడా పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ ఉన్నత విద్యావంతుడు, చదువరి, లోతైన ఆలోచనాపరుడని పిట్రోడా అన్నారు. రాహుల్ ఆలోచనల లోతును ఒక్కోసారి అర్థం చేసుకోలేమని వివరించారు.

ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచించే వ్యూహకర్త రాహుల్ ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదన్నారు. కానీ బీజేపీ మాత్రం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని, కోట్లాది రూపాయలు కుమ్మరిస్తూ రాహుల్ ను అవమానిస్తున్నదని శాం పిట్రోడా మండిపడ్డారు. కాగా, రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం టెక్సాస్ లోని డాలస్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీని ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *