Russia plane crash

Russia plane crash: రష్యాలో ఓ దురదృష్టకర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కుదరకపోవడంతో పైలట్ చుట్టూ తిరిగి మళ్లీ ల్యాండింగ్ ప్రయత్నించిన సమయంలో విమానం కూలిపోయింది. ప్రారంభంలో ఈ విమానం మిస్సింగ్‌గా ప్రకటించగా, ఆపై కూలిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. గాలింపు చర్యల్లో ఉన్న ఎమర్జెన్సీ బృందాలు శకలాలను గుర్తించాయి. ప్రమాద స్థలం ఎయిర్‌పోర్టుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉండగా, మంటలు ఎగసిపడుతున్నాయనీ, ఎవ్వరూ ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రమాదానికి గురైన విమానం అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్-24 మోడల్. గురువారం ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్ నుంచి చైనా సరిహద్దులోని టిండా నగరానికి బయలుదేరింది. విమానంలో ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నారు. టిండాలో ల్యాండింగ్‌ కోసం పైలట్ మొదట ప్రయత్నించి విఫలమవ్వగా, రెండోసారి ప్రయత్నించే క్రమంలో విమానం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు.

Internal Links:

రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్..

6.2 తీవ్రతతో భారీ భూకంపం..

External Links:

రష్యా విమానం కూలిపోయింది.. శకలాలు గుర్తింపు.. వీడియో ఇదిగో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *