TRUMP: యుద్ధాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టెక్ సీఈవోలతో సమావేశంలో మూడు యుద్ధాలను ఆపానని చెప్పగా, తాజాగా కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలను తానే ఆపానని అన్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయానని ఒప్పుకున్నారు. ఆ యుద్ధం సులభమని అనుకున్నా, చాలా క్లిష్టంగా మారిందని చెప్పారు. 2024 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఒక్కరోజులోనే ఆ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పిన హామీని నెరవేర్చలేకపోయానని అంగీకరించారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా సౌదీ అరేబియాలో చర్చలు జరిపినా ఫలితం రాలేదు. అనంతరం స్వయంగా పుతిన్, జెలెన్‌స్కీతో మాట్లాడినా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. 2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఆ తర్వాతి ఇతర యుద్ధాలు మాత్రం ఆగిపోయాయని ట్రంప్ తెలిపారు.
Internal Links:
ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో ఊహించని విషాధం…
External Links:
ఆ యుద్ధాన్ని ఆపడం ఈజీ అనుకున్నా.. తర్వాతే అర్థమైంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు