Trump Deal With India: అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ చాలా దగ్గరగా ఉందని damalina అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమైన సందర్భంగా ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, ఆగస్టు 1 తన దేశానికి ముఖ్యమైన రోజు అవుతుందని, ఆ రోజున తమకు భారీగా ఆదాయం వచ్చే అవకాశముందని వ్యాఖ్యానించారు. సుంకాలపై విధించిన గడువు ఆగస్టు 1తో ముగియనున్న నేపథ్యంలో, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దశలో ఉన్నామని చెప్పారు. అమెరికా ప్రస్తుతం భారత మార్కెట్లోకి ప్రవేశం కల్పించే ఒప్పందంపై పనిచేస్తోంది. ఇదే సమయంలో ఇండోనేషియాతో కూడా కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు. ఇండోనేషియా 19 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోందని ట్రంప్ తెలిపారు.
భారత్-అమెరికా మధ్య ఐదో రౌండ్ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ చర్చలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని భారత అధికారులు తెలిపారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై మినహాయింపులు ఇవ్వాలని అమెరికా కోరుతోంటే, భారత ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని చేస్తోంది. ఎందుకంటే ఇవి భారతీయులకు భావోద్వేగంతో కూడిన రంగాలు. మినహాయింపులు ఇస్తే ఈ రంగాలు నష్టపోతాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ అంశంలో భారత్ తాత్సారంగా వ్యవహరిస్తోంది. అయితే ట్రంప్ విధించిన గడువు దగ్గరపడుతుండటంతో, ఇరు దేశాలు త్వరలో నిర్ణయానికి రావొచ్చని భావిస్తున్నారు.
Internal Links:
External Links:
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు