Trump slams russia india friendship

Trump slams russia india friendship: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రష్యా నమ్మకమైన మిత్రుడిగా నిలిచింది. కానీ అమెరికా మాత్రం పాకిస్థాన్-ఇండియా యుద్ధ సమయంలో భారత దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. అమెరికా తన భూమిపై యుద్ధాలు చేయకపోయినా, ముస్లిం దేశాల్లో యుద్ధాల పేరుతో విధ్వంసం సృష్టించింది. తాజాగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న ట్రంప్, భారత్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారతదేశం వాణిజ్య చర్చల్లో నిమగ్నంగా ఉండగానే, ట్రంప్ ఆగస్టు 1 నుంచి 25 శాతం టారిఫ్‌లు ప్రకటించారు. అమెరికాతో భారత్ చాలా తక్కువ స్థాయిలో వ్యాపారం చేస్తోందని, తమ ఉత్పత్తులపై అధిక పన్నులు విధిస్తున్నదని ఆరోపించారు. అంతేకాక, రష్యా-ఇండియా మధ్య ఉన్న బలమైన సంబంధాలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఈ రెండు దేశాలు కలిసి తమ ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజారుస్తున్నాయన్నారు.

అమెరికా-రష్యా మధ్య వాణిజ్యం ప్రాయం లేకుండా పోయిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు. ఆయన ఇప్పటికీ తానే అధ్యక్షుడినన్న మోహంలో ఉన్నారని, ఆయన ఓ విఫలమైన నాయకుడని వ్యాఖ్యానించారు. గతంలో జూలై 28న డిమిత్రి తన ఎక్స్ ఖాతా ద్వారా ట్రంప్‌కు వార్నింగ్ ఇస్తూ, అమెరికా రష్యాతో ప్రమాదకరమైన ఆట ఆడుతోందని, ఇది యుద్ధానికి దారితీయవచ్చని, యూఎస్ కూడా అందులో భాగస్వామి కావాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు.

Internal Links:

రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం..

అప్పుడు భారత్-పాకిస్తాన్, ఇప్పుడు థాయిలాండ్-కంబోడియా..

External Links:

రష్యా-భారత్ స్నేహంపై విషం కక్కిన ట్రంప్.. పతనమైన ఆర్థిక వ్యవస్థలంటూ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *