Trump vs Modi: భారతదేశంపై ప్రభావం చూపించాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించినా, భారత్ వెనకడుగు వేయలేదు. రష్యాతో స్నేహం కొనసాగిస్తూ ఆయిల్ కొనుగోళ్లు పెంచుకుంది. అలాగే చైనాతో వాణిజ్య సంబంధాలను కూడా పునరుద్ధరించింది. ఈ పరిణామాలు ట్రంప్‌కు నచ్చకపోయినా, భారత్–అమెరికా వాణిజ్య చర్చలు విజయవంతంగా ముగుస్తాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలని ఎదురుచూస్తున్నానని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కూడా స్పందించారు. తానూ ట్రంప్‌తో మాట్లాడాలని ఎదురు చూస్తున్నానని ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్–అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో వాణిజ్య సమస్యలు తొలగి, సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కరించడానికి అధికారులు కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో న్యూఢిల్లీ–వాషింగ్టన్ కలిసి పని చేస్తాయని మోడీ స్పష్టం చేశారు.
Internal Links:
భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్…
మరోసారి అమెరికా వెళ్లనున్న యూరోపియన్ నేతలు…
External Links:
భారత్ దెబ్బకు.. దారికొస్తున్న ట్రంప్ మావా