Trump’s tariffs are expensive: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. యూఎస్ ఫెడరల్ అపీల్స్ కోర్ట్ ఆయన విధించిన టారిఫ్స్ చట్టబద్ధం కాదని తీర్పు చెప్పింది. కానీ తాత్కాలికంగా వాటిని కొనసాగిస్తూ, ట్రంప్‌కు సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఇచ్చింది. కోర్టు ప్రకారం, ట్రంప్ తన అధికార హద్దులను దాటిపోయి సుంకాలు విధించారు. ఈ టారిఫ్స్ వల్ల ఇప్పటికే ఆర్థిక మార్కెట్లు దెబ్బతిని, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార అనిశ్చితి పెరిగింది. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై విధించిన సుంకాలకే ఈ తీర్పు వర్తిస్తుంది. అలాగే యూకే, జపాన్, యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ఒప్పందాల భవిష్యత్తుపై కూడా అనుమానాలు పెరిగాయి.
ఇక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు పేరుతో ఇండియాపై 50% వరకు సుంకాలు విధించడం ఆందోళన కలిగించినా, భారత్ దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలతో భారత ఎగుమతులను 40 దేశాలకు పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పుపై ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో స్పందిస్తూ సుప్రీం కోర్టులో పోరాడుతానని అన్నారు. జూలై నాటికి టారిఫ్స్ ద్వారా 159 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినా, సుప్రీం కోర్టులో కూడా ఓడిపోతే ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Internal Links:
External Links:
ట్రంప్ టారిఫ్స్ చెల్లవ్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు..