Us Ambassador Sergio Gor: అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఢిల్లీలో తన నివాసంలో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాపార, రాజకీయ ప్రముఖులతో పాటు 75 దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు. ఇటీవల భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం, ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ సంభాషణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్న నేపథ్యంలో ఈ విందు జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పియూష్ గోయల్, జైశంకర్, బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్ పాల్గొన్నారు.
ఈ విందుకు సంబంధించిన ఫొటోలను సెర్గియో గోర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, కొత్త వాణిజ్య ఒప్పందంతో పాటు భారత్–అమెరికా వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు పియూష్ గోయల్, జైశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో గోర్ సమావేశమై, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, సరఫరా గొలుసుల బలోపేతం, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026పై చర్చించారు. రెండు దేశాల భాగస్వామ్యం మరింత బలపడుతుందని అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
ఢిల్లీలో గ్రాండ్‌గా అమెరికా రాయబారి విందు.. హాజరైన రాజకీయ ప్రముఖులు