US-India: భారత్-అమెరికా మధ్య సుంకాల ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు నూతన రాయబారిగా తన సన్నిహితుడు, రాజకీయ సహాయకుడు సెర్గియో గోర్ (38)ను నియమించారు. విదేశాంగ విధానంలో అనుభవం కలిగిన గోర్ అద్భుతంగా పని చేస్తారని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. దక్షిణ-మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారి పాత్రను కూడా ఆయన నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌పై 50 శాతం సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోర్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నియామకం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయా? లేక మరింత ఉద్రిక్తత పెరుగుతుందా అన్నది చూడాలి.
సెర్గియో గోర్ ట్రంప్‌కు అత్యంత విధేయుడు, నమ్మకస్థుడు. వైట్‌హౌస్ లోపల ఆయన ట్రంప్‌కు దగ్గరి వ్యక్తిగా పేరుగాంచారు. ఎలాన్ మస్క్‌తో గోర్‌కు సంబంధాలు సరిగా లేవు; ఆయనను పాము లాంటి వాడని కూడా వ్యాఖ్యానించారు. సాధారణంగా దౌత్యవేత్తల నియామకంలో ట్రంప్ తన సన్నిహితులకే ప్రాధాన్యత ఇస్తారు, ఆలోచనలో భాగంగానే గోర్‌ను భారత రాయబారిగా నియమించారు. ఇక విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా గోర్ నియామకాన్ని సమర్థిస్తూ, భారత్-అమెరికా సంబంధాల్లో ఆయన అద్భుతమైన ప్రతినిధిగా ఉంటారని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
Internal Links:
శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్..
క్వీన్స్‌ల్యాండ్‌లో భారీ భూకంపం..
External Links:
టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో నూతన రాయబారి నియామకం